Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 15:58:30
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం చేస్తున్న ఒక్కడు మిగిలాడు సినిమా.. అలాగే మొన్ననే స్టార్టయిన మరో సినిమా.. ఇవి రెండూ పూర్తవ్వగానే ఇక సినిమాలకు స్వస్తి పలుకుతున్నా అంటూ పొద్దున్నే ఒక ట్వీటేశాడు మంచు మనోజ్. ఆ దెబ్బతో టోటల్ ఇండస్ర్టీ షాక్ అయ్యింది. కెరియర్ టాప్ గేర్లో ఉన్నప్పుడు అరవింద్ స్వామి సినిమాలను వదిలేసినట్లు.. ఇప్పుడు మనోడు కెరియర్ టాప్ గేర్ లో లేకపోయినా వదిలేస్తున్నాను అనడం అందరికీ షాకిచ్చింది. ఇక ఇంతలోనే మనోడు ట్వీటు డెలీట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కొన్ని ట్వీట్లు వేశాడు.

వావ్. నేను వేసిన ఒక్క ట్వీటుతో అలాంటి రెస్పాన్స్ కాని.. అలాంటి క్రిటిసిజం కాని ఊహించలేదు. అందరూ చాలా డిఫరెంట్ గా ఆలోచించారు. నేను నిజానికి నా కొత్త సినిమా గురించి ప్రకటన చేద్దాం అనుకున్నాను. అది నేను అనుకున్నట్లు కరక్టుగా జరగలేదు. నా తదుపరి మూవీ గురించి ప్రకటన చేసేముందు.. ఈ విషయాలన్నీ కాస్త కూల్ అయ్యేవరకు వెయిట్ చేస్తాను అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు మనోజ్. అయితే ఈ ట్వీట్లో క్లారిటీకంటే కూడా.. మీడియా వారు తన ట్వీట్లను తప్పుగా అర్ధం చేసుకున్నారు అనే భావనే ఎక్కువగా కనిపిస్తోంది. యాక్టర్ గా నా ఆఖరి సినిమాలు ఈ రెండే అని చెప్పేసి.. ఇప్పుడు దానిని తప్పుగా అర్ధం చేసుకున్నారు అంటే మీనింగ్ ఏంటి మనోజ్? ఇప్పుడు దీని మీద కూడా ఒక క్లారిటీ ట్వీటు వెయ్యి బాసూ.

నిజానికి మనోడు సరదాగా ఏదో ప్రాంక్ చేద్దామనే ఆ ట్వీటును వేసుంటాడు అని కొందరు అంటున్నారు. అసలు మీడియా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని సరదాగా ట్వీటేస్తే అది ఆ రేంజులో రచ్చ చేసింది.

,  ,  ,  ,