Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2016 12:40:35
facebook Twitter Googleplus
Photo

మొన్న అల్లు అర్జున్ క్లాస్ గా కనిపిస్తూనే మాస్.. ఊర మాస్ అంటూ డైలాగ్ చెప్పాడు. ఐతే తమిళ హీరో విశాల్ మాత్రం అసలు సిసలు మాస్ అంటే ఏంటో చూపిస్తున్నాడు. అతడి కొత్త సినిమా ?మరుదు? ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే.. ఇది ఊర మాస్ కూడా కాదు... ఊర ఊర మాస్ అనిపించడం ఖాయం. ఎర్ర బనియన్.. ఎర్ర నిక్కరు.. గళ్ల లుంగీ.. నోట్లో కత్తి.. లుంగీ ఎగ్గడుతూ వీరావేశంతో దూసుకొస్తున్నాడు ఓ పోస్టర్లో. ఇంకో పోస్టర్లోనూ ఇలాంటి మాస్ అవతారంలోనే డ్యాన్సులేస్తున్నాడు. చూస్తుంటే విశాల్ ఊర మాస్ లేబర్ క్యారెక్టరేదో చేస్తున్నట్లున్నాడు. బాల సినిమా ?వాడు వీడు?లో కంటే కూడా మాస్ గా కనిపిస్తున్నాడు విశాల్ ఇందులో.

ముత్తయ్య అనే యువ దర్శకుడు రూపొందిస్తున్న ?మరుదు? ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో విశాల్ సరసన తెలుగమ్మాయి శ్రీదివ్య హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. గత కొన్నేళ్లుగా సొంత బేనర్లోనే సినిమాలు చేస్తూ వస్తున్న విశాల్.. చాలా విరామం తర్వాత బయటి బేనర్లో ఈ సినిమా చేస్తున్నాడు. జె.వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ?రఘువరన్ బీటెక్? దర్శకుడు వేల్ రాజ్ ఛాయాగ్రహణం అందిస్తుండటం విశేషం. గత కొన్నేళ్లలో వరుసగా కథా బలం ఉన్న థ్రిల్లర్స్ చేసిన విశాల్.. ఇప్పుడు మళ్లీ తనదైన శైలిలో పక్కా మాస్ మసాలా యాక్షన్ మూవీ చేస్తున్నాడు. జూన్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకేసారి తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,