Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Aug-2016 17:03:13
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే యుట్యూబ్ లో చాలామంది తమ సొంత ఛానళ్లను నెలకొల్పి.. తామే సొంతంగా కొన్ని షార్ట్ ఫిలింస్ ను ప్రొడ్యూస్ చేస్తూ.. మరోప్రక్కన ఇతరుల షార్ట్ ఫిలింస్ ను కూడా అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీతో సినిమాలు తీయడం ఈజీ అయిపోయిన వేళ.. చాలామంది ఈ షార్ట్ ఫిలింస్ ఈజీగానే తీసేస్తున్నారు. అందుకే అసలు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అంటూ అమెరికాలో యురోప్ లో బాగా పాపులర్ అయిన ఈవెంట్ ను మనం కూడా మొదలెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన మన సెలబ్రిటీలకు తట్టింది.

నిన్నటికి నిన్న తామో షార్టు ఫిలిం ఫెస్టివల్ పెడుతున్నాం అని దర్శకుడు సుకుమార్ మరియు నైజాం పంపిణీదారుడు అభిషేక్ పిక్చర్స్ వారు ప్రకటించారు. ఇప్పుడు దర్శకుడు మారుతి కూడా అదే పని చేయబోతున్నాడట. ఆయన కూడా ''నా సినిమా'' అంటూ ఒక షార్ట్ ఫిలిం కంటెస్ట్ పెడుతున్నాడు. అందులో గెలిస్తే ఆయనతో పనిచేసే ఛాన్సు కలిపిస్తాడట. షార్ట్ ఫిలిం దర్శకులకు అమేజింగ్ అవకాశం అంటూ అందరూ ఇలా సడన్ గా ఈ ఫిలింస్ పై పడటం ఏంటో ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. గతంలో పూరి జగన్ కూడా ఒక ప్రముఖ పత్రికతో కలసి ఇలాంటి కంటెస్టే పెట్టాడు. అందులో గెలిచిన వారితో సినిమా ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. ఇంతవరకు దాని రిజల్ట్ ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు.

అందుకే జనాలు ఇప్పుడు.. ఎంతమంది సెలబ్రిటీలు ఈ షార్ట్ ఫిలిం కంటెస్టులు పెడతారండీ బాబూ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

,  ,  ,  ,  ,