Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 12:38:25
facebook Twitter Googleplus
Photo

నెగిటివ్ టాక్ లేని హీరోల్లో నాని ఒకరు. నాని సినిమా చేస్తే అన్ని వర్గాల ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా కాలేజ్ యువత న్యాచురల్ స్టార్ సినిమాలను చాలానే ఇష్టపడతారు. ఇక అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాత్రం ఆలోచించకుండా నాని సినిమా కోసం థియేటర్స్ వరకు వెళుతుంటారు. గత కొంత కాలం నుండి నాని కూడా మంచి విజయాలను అందుకోవడంతో సినిమా సినిమాకు మార్కెట్ రేంజ్ పెరుగుతోంది.

అయితే గురువారం నాని మరో సినిమా ఎంసీఏ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక మొదటి ఆటకే టాక్ అదిరిందని చిత్ర యూనిట్ టపాసుల మోతతో సెలబ్రేషన్స్ ని మొదలెట్టేసింది. ఇకపోతే సినిమా పబ్లిసిటి విషయంలో దిల్ రాజు ఏ స్థాయిలో ఆలోచిస్తాడో అందరికి తెలిసిందే. అందులో నాని సినిమా కావడంతో డోస్ కాస్త ఎక్కువగానే పెంచాడు. అయితే సినిమా ఇంటర్వెల్ లో ఎంసీఏ టాటూ వేసుకోండని స్పెషల్ గా చెప్పడంతో అందరు ఎంసీఏ టైటిల్ లోగోని చేతిపై టాటూగా వేయించుకుంటున్నారు.

ప్రస్తుతం కొన్ని మల్టిప్లెక్స్ థియేటర్స్ లో యూత్ చాలా మంది ఎంసీఏ టాటూ పై క్రేజీగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక మిడిల్ క్లాస్ అబ్బాయి కొంచెం మిక్సిడ్ టాక్ ను తెచ్చుకున్నాడు. మరో రెండు రోజులు గడిస్తే గాని చెప్పలేము. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం నాని కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా ఎంసీఏ నిలిచింది.

,  ,  ,  ,  ,