Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2016 11:21:02
facebook Twitter Googleplus
Photo

నవంబరులో చిన్న చిన్న చిత్రాలన్నీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ శుక్రవారం సుమంత్ నటించిన ?నరుడా డోనరుడా?.. ఆర్పీ ?మనలో ఒకడు? రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ఇక వచ్చే వారం ఇప్పటికే నాగచైతన్య ?సాహసమే శ్వాసగా సాగిపో? చిత్రం రిలీజ్ కు రెడీ అయిపోయింది. దాంతో పాటు నిఖిల్ సినిమా ?ఎక్కడికి పోతావు చిన్నవాడా? కూడా రిలీజ్ కానుందనే ప్రచారం వుంది. ఇది సెన్సార్ కూడా పూర్తయింది. దీనికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. మరో వైపు నవీన్ చంద్ర తాజాగా నటించిన ?మీలో ఎవరు కోటీశ్వరుడు? మూవీ కూడా సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి కూడా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ అధికారులు.

ఇందులో థర్టీ ఇయర్స్ పృథ్వీ... నవీన్చంద్ర హీరోలుగా... సలోని.. ?పటాస్?ఫేం శృతి సోధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై... ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో కమెడీయన్ పృథ్వీ సరసన సలోని నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే హిలేరియస్ ఎంటర్టైనర్ సీన్లు ప్రేక్షకుల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయని నిర్మాత అంటున్నాడు.

ఇంకా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ''మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈమధ్యకాలంలో ఇలాంటి చక్కని ఎంటర్టైనర్ని చూడలేదని... సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్లోనే ఈ చిత్రాన్ని వరల్డ్వైడ్గా విడుదల చేయాలని ప్లాస్ చేస్తున్నాం'' అన్నారు.

,  ,  ,  ,  ,  ,