Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2016 16:10:10
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి పూర్తిస్థాయి హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఫిలింసిటీలో జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో చిరు సరసన నటించేందుకు ఎవర్ని ఎంపిక చేయపోవడం మెగాఫ్యాన్స్‌ను ఇన్నాళ్లూ సస్పెన్స్‌కు గురిచేసింది. రీసెంట్‌గా చిరుతో జోడీ కట్టేందుకు బాలీవుడ్ ఐటమ్ భామ నర్గీస్ ఫక్రీని ఖరారు చేశారని సమాచారం. బాలీవుడ్‌లో హాట్‌ సెక్సీ బాంబ్‌గా పేరు తెచ్చుకున్న నర్గీస్ తెలుగులోనూ పలు సినిమాల్లో ఐటమ్ భామగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు చిరు సినిమా కోసం త్వరలో చిరంజీవితో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొనుందట. ఆ షూట్‌లో ఇద్దరి జోడీని చూసిన తర్వాత ఆమెను హీరోయిన్‌గా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే..చిరంజీవి 150వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మెగా ఫ్యామిలీ మూవీగా రూపొందుతోంది. ఇప్పటికే తండ్రి సినిమాతో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి రామ్ చరణ్ నిర్మాతగా మారగా..చిరు తనయ సుస్మిత ఈ చిత్రానికి చిరంజీవి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తోందట. ఇటీవలే షూటింగ్ ప్రారంభించి ఈ సినిమా సెట్స్‌‌లో చిరంజీవి పెద్ద కూతురు కూడా కనిపించింది.

,  ,  ,  ,  ,  ,  ,