Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2017 10:16:43
facebook Twitter Googleplus
Photo

దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్’. సినిమా చూస్తే ఎందుకంత ఖర్చయిందో కూడా అర్థమవుతుంది. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. సినిమా మీద కొంచెం పాజిటివ్ బజ్ కూడా కనిపించింది. కానీ తొలి రోజు మిస్టర్ వసూళ్లు మాత్రం ఆశాజనకంగా లేవు. తొలి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.2.25 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. బడ్జెట్.. బిజినెస్ ప్రకారం చూస్తే తొలి రోజు రూ.4-5 కోట్ల మధ్య అయినా షేర్ రావాల్సింది. సినిమాకు టాక్ బ్యాడ్ గా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ బాగుంటాయని ఆశించారు. కానీ అలా జరగలేదు. ఈ ఓపెనింగ్స్ తో సినిమా సేఫ్ జోన్లోకి రావడమంటే కష్టమే. మరి శనివారం వసూళ్లు డ్రాప్ అయినట్లే కనిపిస్తోంది.
సోమవారం నుంచి మాత్రం మిస్టర్ కు గడ్డు పరిస్థితులు తప్పవని అంచనా వేస్తున్నారు. ‘మిస్టర్’కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది. దీనికి పోటీగా వచ్చిన సినిమాలు కూడా దీన్ని దెబ్బ తీసేలా ఉన్నాయి. లారెన్స్ మూవీ శివలింగ గొప్ప టాక్ ఏమీ తెచ్చుకోకున్నప్పటికీ అది మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. బి-సి సెంటర్లలో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసేలా కనిపిస్తోంది. మాస్ ఏరియాల్లో మిస్టర్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఇక ఎ సెంటర్లలో హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో వచ్చిన కొత్త సినిమా వల్ల ‘మిస్టర్’పై ప్రభావం పడుతోంది

,  ,  ,  ,  ,