Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2017 10:21:00
facebook Twitter Googleplus
Photo

మనోజ్ ద్విపాత్రాభినయం చేసిన ఒక్కడు మిగిలాడు సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. బలమైన ఎమోషనల్ సీన్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతోందని తెలుస్తోంది. ఈ హై ఇంటెన్స్డ్ మూవీని అజయ్ ఆండ్రూస్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్...ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పాత్రలో విద్యార్థి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. తనయుడు మనోజ్ చిత్రం విడుదల సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విషెస్ చెబుతూ ఓ ఇంటరెస్టింగ్ ట్వీట్ చేశారు. గతంలో తన సినిమాలో బాల విప్లవకారుడిగా నటించిన మనోజ్ ఫొటోను మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఆ సినిమా లాగే ఒక్కడు మిగిలాడు కూడా ఘనవిజయం సాధించాలని మోహన్ బాబు కోరుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ట్వీట్ వైరల్ అయింది.

మోహన్ బాబు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు - మోహన్ బాబుకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన జ్ఞాపకాలను మోహన్ బాబు ట్విట్టర్ లో నెమరువేసుకున్నారు. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ తో మనోజ్ దిగిన ఫొటోను రెండు రోజుల క్రితం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అన్నగారి రామకృష్ణ స్టూడియోలో మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ సమయంలో అన్నగారితో మనోజ్! అంటూ మెసేజ్ చేశారు. తాజాగా మనోజ్ చిత్రం ఒక్కడు మిగిలాడు హిట్ కావాలని కోరుకుంటూ అడవిలో అన్న సినిమాలో తనతో నటించిన మంచు మనోజ్ ఫొటోను పోస్ట్ చేశారు. చిన్న కుర్రాడి పాత్రలో మనోజ్.. తండ్రితో పాటు ఓ ఎర్రజెండా పట్టుకుని నడుస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. అడవిలో అన్న మూవీలో నాతో కలిసి విప్లవ జెండా పట్టిన మనోజ్....ఇప్పుడు ఒక్కడు మిగిలాడుగా మరోసారి విజయకేతనం ఎగరవేయాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు

,  ,  ,  ,  ,