Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Oct-2017 16:40:26
facebook Twitter Googleplus
Photo

సినీ హీరోల కొడుకుల మొదటి సినిమా ఏ స్థాయిలో అంచనాలను రేపేదో గాని. ప్రస్తుత రోజుల్లో మాత్రం తార స్థాయి అంచనాలను రేపుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా వరకు అప్ కమింగ్ హీరోలు ఉన్నారు. వారిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పై ఏ స్థాయిలో ఎంట్రీ ఇస్తాడన్నది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే కొన్ని రోజుల క్రితం బాలయ్య - తేజ కాంబినేషన్ లో వస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ టీనేజ్ వయసులో ఉన్నప్పటి పాత్రను మోక్షజ్ఞ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. బాలయ్య కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని కూడా కామెంట్స్ వినిపించాయి. ఇకపోతే అంతకుముందు బాలయ్య 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో కూడా కనిపిస్తున్నాడని కూడా కొన్ని గాసిప్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావ్ మరొక వార్త చెప్పి టాలీవుడ్ లో అందరు చర్చించుకునే విధంగా చేశారు.

అయన గత కొంత కాలం నుంచి ఆదిత్య 369 సీక్వెల్ తీస్తానని చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ద్వారా ఆ సీక్వెల్ ఉంటుందని ఆ సంచలన దర్శకుడు చెబుతున్నాడు. టైమ్ ట్రావెలింగ్ తో సాగే ఆ కథలో మోక్షజ్ఞ లీడ్ రోల్ లో నటిస్తాడని చెబుతూ.. బాలకృష్ణ ప్రత్యేక అతిధి పాత్రలో నటిస్తారు అని చెబుతున్నాడు. ఇప్పటికే కథను మొత్తం బాలయ్య కు వినిపించినట్లు చెప్పారు. ఇక అయన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సినిమా సెట్స్ పైకి వెళుతుందని ఆయన చెప్పారు.

,  ,  ,  ,  ,