Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 14:41:41
facebook Twitter Googleplus
Photo

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ - ది అన్ టోల్డ్ స్టోరీ బాక‍్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలిరోజే 21.30 (గ్రాస్) కోట్ల రూపాయలతో రికార్డు స్థాయి వసూళ్లు సాధించడంతో మొదలైన ఈ కలెక్షన్ల వర్షం రికార్డుల దిశగా దూసుకెళ్తుందని తెలుస్తోంది. దసరా హాలిడేస్ ను కూడా ధోనీ బాగానే క్యాష్ చేసుకున్నాడు. ఒకపక్క వీకెండ్ మరోపక్క దసరా హాలిడేస్ కావడంతో గత శుక్రవారం 4.07 - శనివారం 5.20 - ఆదివారం 5.90 - సోమవారం 3.40 కోట్లు వసూల్ చేయగా ఇక దసరా రోజు కూడా 4.21 కోట్లు వసూళ్లు రాబట్టాడు. ఈ దూకుడులో ఇప్పటివరకు దాదాపు రూ. 116 కోట్లు వసూలు చేసింది. ఇది కేవలం భారతీయ మార్కెట్లలో సాధించిన బిజినెస్ మాత్రమేనట. ఇప్పటివరకు వచ్చిన బయోపీక్స్ లో తొలిరోజు వసూల్ రికార్డును సృష్టించిన ఈ సినిమాకు ఇదే బయోపీక్స్ సినిమాల్లో దేనికీ రానన్ని కలెక్షన్లు రాబడుతోందట.

ఈ విషయాలపై స్పందించిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సీఈఓ విజయ్ సింగ్ ధోనీ పట్ల భారతీయులకు ఉన్న అభిమానం ఈ కలెక్షన్ల రూపంలో తెలుస్తోందని భారతీయ సినిమాలలో ఇప్పటివరకు వచ్చిన బయోపీక్స్ లో ఇదే అతిపెద్ద గ్రాసర్ అని అన్నారు. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు - సినిమా అభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మరోపక్క ధోనీ సినిమా విడుదలయిన తర్వాత మిర్జియా - తుటక్ తుటక్ తుటియా లాంటి సినిమాలు విడుదలైనా కూడా ఈ సినిమా డిమాండు పెరుగుతూనే ఉందని నిర్మాతలు చెబుతున్నారు.

నీరజ్ పాండే దర్శకత్వంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాంచీ గల్లీల నుంచి టీమిండియా కెప్టెన్ వరకు ధోనీ ప్రయాణం ఎలా సాగిందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కాగా ఈ ఏడాది తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో సుల్తాన్ (36.54 కోట్లు) తర్వాత ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిల్సిందే!

,  ,  ,  ,