Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2017 11:11:35
facebook Twitter Googleplus
Photo

హెబ్బా పటేల్.. ఈ పేరు టాలీవుడ్లో ఓ సంచలనం. కుమారి 21 ఎఫ్ లో చాలా బోల్డుగా నటించి అందరి దృష్టిలో పడ్డ ఈ భామ.. తన మాటతీరు.. నడవడికలోనూ కొంచెం బోల్డ్ గానే కనిపిస్తుంటుంది. దీనికి తోడు అమ్మడి పేరు తరచుగా ఎఫైర్లలో నానుతుంటుంది. రాజ్ తరుణ్ తో వరుసగా సినిమాలు చేసేసరికి ఆమెకు.. అతడికి జనాలు ముడిపెట్టేశారు. ఇద్దరూ బయట కూడా కొంచెం క్లోజ్ గా మూవ్ కావడంతో ఈ ఎఫైర్లో నిజం లేకపోలేదనే అనుకున్నారు జనాలు. ఐతే తమ మధ్య ఏమీ లేదని ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఐతే ఇంతలో హెబ్బా పేరు మరో యువ కథానాయకుడితో ముడిపడింది.

ఏంజెల్ సినిమాలో హెబ్బాతో జతకట్టిన నాగ అన్వేష్ ఆమెకు దగ్గరయ్యాడని గుసగుసలు వినిపించాయి. నాగ అన్వేష్ రంగ ప్రవేశంతోనే రాజ్ కు హెబ్బా దూరమైందని కూడా వార్తలు పుట్టించారు కొందరు. ఐతే కెరీర్లో నిలదొక్కుకుంటున్న సమయంలో ఇలాంటి రూమర్లు మంచిది కాదనుకున్నాడో ఏమో.. నాగ అన్వేష్ ఈ ప్రచారాన్ని ఖండించాడు. సెట్స్ వరకు మాత్రమే తనకు హెబ్బా క్లోజ్ అని.. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని నాగ అన్వేష్ అన్నాడు. రాజ్ తరుణ్-హెబ్బాల మధ్య ఏం జరిగిందో తనకు తెలియదని.. తాను మాత్రం హెబ్బాను ఎప్పుడూ మంచి ఫ్రెండులాగా చూస్తానని అతనన్నాడు. తన గురించి చెబితే చెప్పాడు కానీ.. ఈ కుర్రాడు రాజ్ తరుణ్ ఊసెత్తడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం.

,  ,  ,  ,  ,