Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2016 11:41:16
facebook Twitter Googleplus
Photo

సీనియర్ స్టార్స్ లో సూపర్ ఫామ్ లో ఉన్న హీరో అక్కినేని నాగార్జున. మనం.. సోగ్గాడే చిన్ని నాయన.. ఊపిరి చిత్రాలతో వరుసగా మూడు సూపర్ హిట్స్ కొట్టేశాడు నాగ్. ఇదే స్పీడ్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ శుక్రవారం రిలీజ్ కానున్న నిర్మలా కాన్వెంట్ లో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించినా.. ఈ చిత్రాన్ని అన్నీ తానై మోస్తున్నాడు నాగ్. ముఖ్యంగా సెకండాఫ్ అంతా నాగ్ ఉండనున్నారంటే.. ఈ కేరక్టర్ తో ఆయన ఎంత కనెక్ట్ అయ్యాడో అర్ధమవుతుంది.

అయితే.. తనకు సినిమాల రేటింగులు ఇవ్వడంపై పెద్దగా నమ్మకం లేదంటూ కామెంట్స్ చేశాడు నాగ్. 'ఏ సినిమా అయినా అందులో కంటెంట్ ఉంటే చాలు అదే ఆడుతుంది. రేటింగులపై రిజల్ట్ ఆధారపడి ఉటుందంటే నేను నమ్మను' అని తేల్చేశాడు నాగ్ నిజానికి నాగ్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వింతేమీ లేదు. రివ్యూలు-రేటింగ్ లకు అతీతంగా ఈ మధ్య రిజల్ట్ లు వస్తున్న సంగతి తెలిసిందే. రేటింగులు బాగున్న సినిమాలకు కలెక్షన్స్ లేకపోవడం.. బాగోలేదన్న సినిమాలు ఇరగదీసి ఆడేయడం జరుగుతోంది. అందుకే నాగ్ ఇలా చెప్పారన్న మాట.

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ టాలీవుడ్ కి పరిచయం కానుండగా.. ఈ చిత్రంలో నాగ్ పాత్ర సెకండాఫ్ లో వచ్చి యాక్టివ్ గా మారిపోతుంది. ఇదే కాకుండా.. ఓంనమో వెంకటేశాయ చిత్రంలో కూడా నాగార్జున నటిస్తున్నారు. హథీరాం బాబా పాత్రలో నాగ్ మెరవనున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,