Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Sep-2017 14:38:18
facebook Twitter Googleplus
Photo

ఎక్కువని చెప్పే క్రమంలో మరొకరిని తక్కువ చేయటం ఎంతమాత్రం మంచిది కాదు. తన తమ్ముడికున్న ఫాలోయింగ్ గురించి చెప్పేందుకు మెగా బ్రదర్ నాగబాబు చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయి. తెలుగు నేల మీద భారీగా అభిమానుల్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ పుణ్యమా అని.. పవన్ కు ఆయన అభిమానులు యాడ్ అయ్యారు. తర్వాతి కాలంలో తనదైన క్రేజ్ను పవన్ సంపాదించుకున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే.. తన తమ్ముడికున్న క్రేజ్ గురించి నాగబాబు చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. పలువురికి మంట పుట్టించేలా మారటం గమనార్హం.

తన తమ్ముడి బలాన్ని భారీగా ఊహిస్తున్నట్లుగా నాగబాబు మాటలు ఉన్నాయని చెప్పాలి. ఇటీవల కాలంలో బయటకు వస్తున్న పోల్ సర్వేల్లో తలో మాట చెబుతున్నారని.. ఒకరు అధికార పక్షానికి ఎక్కువ సీట్లు వస్తాయంటే.. మరొకరు జగన్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారన్నారు. అయితే.. పవన్ కల్యాణ్ గురించి మాత్రం కొంతమందే చెబుతున్నారని.. ఇలాంటి వాళ్లకు తెలియంది.. తమకు తెలిసిందేమిటంటే.. కల్యాణ్ కు ఎంత ఇమేజ్ ఉందన్నది తమకు బాగా తెలుసన్నారు. కల్యాణ్కున్న ఫాలోయింగ్ బయటకు చెప్పటం లేదని.. ఆ ఫాలోయింగ్ ను ఊహించటం కష్టమన్నారు.

తన తమ్ముడికున్నఫాలోయింగ్ గురించి వివరించిన నాగబాబు.. "టిపికల్ ఫాలోయింగ్ ఎన్టీఆర్ కు ఉండేదని.. అదే తీరులో కన్నడంలో రాజ్ కుమార్ కు ఉండేదని.. కానీ పవన్ కు మాత్రం భిన్నమైన ఫాలోయింగ్ ఉందన్నారు. చిరుకు నటుడిగా ఫాలోయింగ్ ఉంటే.. పవన్ కు మాత్రం నటుడిగానే కాదు.. వ్యక్తిగతంగానూ కూడా ఫాలోయింగ్ ఉందన్నారు. పబ్లిక్ లో పవన్ తిరిగిన విధానం కానీ..ఆయన చేసిన పనులే ఆయన ఫాలోయింగ్ ను పెంచాయన్నారు.

పవన్కున్న ఫాలోయింగ్ ఎవరికీ లేదని.. తనకు తెలిసి టాలీవుడ్ లో ఎవరికీ లేనంత ఫాలోయింగ్ కల్యాణ్ కు ఉందన్నారు. తమ్ముడి ఫాలోయింగ్ ను ఆకాశానికి ఎత్తేసిన తీరుతో మెగాస్టార్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తమ్ముడ్ని పొగడటం వరకూ ఓకే కానీ.. అన్నయ్యను చిన్నబుచ్చటం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు జాతి గొప్పతనాన్ని విశ్వానికి తెలియజేసిన ఎన్టీవోడి కంటే పవన్ మొనగాడన్నట్లుగా నాగబాబు చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

,  ,  ,  ,  ,