Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2016 11:01:24
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం తెలుగు యువ హీరోలో మాంచి జోష్లో ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. దసరాకు ?ప్రేమమ్?తో సూపర్ హిట్ కొట్టిన చైతూ.. ?సాహసం శ్వాసగా సాగిపో? సినిమా విషయంలోనూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారమే విడుదలవుతోంది. ?ప్రేమమ్? రిలీజవడానికి ముందు చైతూ.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా మాత్రమే కమిటయ్యాడు. ఐతే ?ప్రేమమ్? రిలీజయ్యాక అతడికి బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా.. కృష్ణ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో సినిమా.. ఓ పంజాబీ సినిమా రీమేక్.. తమిళ హట్ ?మెట్రో? రీమేక్.. బాలీవుడ్ మూవీ ?టు స్టేట్స్? రీమేక్.. ఇలా చాలా ప్రాజెక్టుల్లో చైతూ పేరు వినిపించింది. ఐతే వాస్తవంగా తాను ఏయే సినిమాలు చేస్తున్నానో చైతూనే క్లారిటీ ఇచ్చాడు.

??కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా వెంటనే మొదలవుతుంది. అది రీమేక్ కాదు. నిన్నే పెళ్లాడతా తరహాలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్. ఆ చిత్రానికి ఇంకా ఏ టైటిల్ అనుకోలేదు. దీని తర్వాత కృష్ణ అనే దర్శకుడితో ఓ సినిమా ఉంటుంది. అది కూడా రీమేక్ కాదు. ?జెంటిల్మన్? రచయిత డేవిడ్ నాథన్ అందించిన కథతో ఆ సినిమా చేస్తున్నా. ఇంద్రగంటి గారి దర్శకత్వంలో సినిమా కమిటయ్యాను. ప్రస్తుతానికి కమిటైనవి ఇవే?? అని చైతూ చెప్పాడు. ?హలో బ్రదర్? రీమేక్ గురించి గతంలో జరిగిన ప్రచారం గురించి చైతూ మాట్లాడుతూ.. ??అప్పుడు చేద్దామనుకున్నాం. కుదర్లేదు. ఆ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిదైంది. ఎందుకంటే ఆ స్థాయిలో నేను నటించలేను. కొన్ని సినిమాల్ని ముట్టుకోకపోవడమే మంచిది?? అని చైతూ చెప్పాడు.

,  ,  ,  ,  ,