Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jul-2017 13:40:20
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు కృష్ణవంశీ దగ్గర శిష్యరికం చేసిన మరో శిష్యురాలు దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. ఆమె పేరు సౌజన్య.

ప్రేమమ్ . రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుసగా రెండు హిట్లు కొట్టి ఊపుమీదున్న అక్కినేని నాగచైతన్యతో సినిమా ద్వారా సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాబోతుండటం విశేషం. కృష్ణవంశీ దగ్గర చాన్నాళ్ల పాటు అసిసోయేట్ గా చేస్తున్న సౌజన్య.. ఆయన రెఫరెన్సుతో చైతూను కలిసి ఓ లైన్ వినిపించిందట. అది చైతూకు నచ్చి పూర్తి స్క్రిప్టుతో రమ్మని చెప్పాడట. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టులోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుందని సమాచారం. నిర్మాత కూడా రెడీగా ఉన్నాడట.

ప్రస్తుతం యుద్ధం శరణం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న చైతూ.. ప్రేమమ్ దర్శకుడు చందూ మొండేటితో తన కొత్త సినిమాను కూడా త్వరలోనే మొదలుపెట్టాలనుకుంటున్నాడు. అక్టోబర్లో సమంతను చైతూ పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఆ లోపే తమ కాంబినేషన్లో సినిమా మొదలవుతుందని చందూ తెలిపిన సంగతి తెలిసిందే. మరి చందూ.. సౌజన్య సినిమాల్లో దేన్ని ముందు మొదలుపెడతాడో చూడాలి.

,  ,  ,  ,