Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jul-2017 10:57:54
facebook Twitter Googleplus
Photo

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత ఇప్పుడు యుద్దం శరణం సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పుడు ఒక టాక్ వినిపిస్తోంది.

యుద్ధం శరణం టైటిల్ తో రిలీజవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చింది. హెయిర్ స్టైల్ కొద్దిగా మార్చి సీరియస్ లుక్ తో ఉన్న నాగచైతన్య అప్పియరెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. బేసిగ్గా చైతూ కామ్ అండ్ కూల్ కావడంతో యుద్ధానికి వెళ్లే సైనికుడి తరహా ఎక్స్ ప్రెషన్ లో కనిపిస్తున్నాడు. కాకపోతే ఈ సినిమా టైటిల్ ను గతంలో యుద్దం శరణం గచ్చామి అనుకున్నారు. ఇప్పుడేమో ఆ గచ్చామీని కట్ చేశారు. వై? మొన్న రిలీజైన డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ 'ఈరోజుల్లో అనాల్సింది బుద్దం శరణం గచ్చామి కాదు సార్.. యుద్దం శరణం గచ్చామి అనే డైలాగ్ వాడేశాడు కాబట్టి.. ఇప్పుడు అదే టైటిల్ పెడితే బాగోదని భావించి టైటిల్ మార్చేశారట. అదీ టాక్.

వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. కృష్ణ ఆర్.వి.మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.

,  ,  ,  ,