Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Dec-2014 11:09:21
facebook Twitter Googleplus
Photo

'చందమామ కథలు', 'ఊహలు గుసగుస లాడే' సినిమాలతో పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య నటించిన 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, ఇప్పుడు చిన్న నిర్మాతలకు దర్శకులకు ఈ కుర్రాడు అందుబాటులో వుండడంతో ఇతనికి డిమాండు బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మరో మూడు సినిమాలు ఒప్పుకున్నాడు. వీటి గురించి చెబుతూ, "నందినీ రెడ్డిగారు చేసే ఓ లవ్ స్టోరీలో చేస్తున్నాను. సాయి అనే కొత్త డైరెక్టర్ తో ఫిబ్రవరి నుంచి ఓ సినిమా వుంది. ఇక చింతకాయల రవి దర్శకుడు యోగి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఒప్పుకున్న సినిమాలు ఇవే" అని తెలిపాడు నాగశౌర్య.

,  ,  ,  ,  ,