Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Mar-2017 12:41:18
facebook Twitter Googleplus
Photo

చందమామా కథలు చిత్రంతో వెండి తెర వెలుగులోకి వచ్చిన యంగ్ హీరో నాగ శౌర్య, శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణ్ వైభోగమే వంటి సినిమాలు పర్వాలేదనిపించుకోగా చివరి చిత్రాలు జ్యో అచ్యుతానంద మంచి విజయంగాను, నీ జతలేక పరాజయంగాను నిలిచాయి. ఇక ఆ తర్వాత బలమైన స్క్రిప్ట్ కోసం కాస్త ఎక్కువ సమయమే కేటాయించిన నాగ శౌర్య ఒక సినిమాని ఓకే చేసినట్టు తెలుస్తోంది.
ఆ చిత్రానికి అమ్మమ్మగారి ఇల్లు అనే ఆసక్తికరమైన, వెరైటీ టైటిల్ ను పెట్టారు. ఈ టైటిల్ చూస్తుంటే సినిమా పక్కాగా మంచి రొమాంటిక్ కంటెంట్ తో కూడిన పూర్తి కుటుంబ కథా చిత్రంగా ఉండనుందని ఇట్టే అర్థమవుతోంది.

,  ,  ,  ,  ,