Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Mar-2016 16:39:22
facebook Twitter Googleplus
Photo

ఒక స్టార్ హీరో ఇంకో స్టార్ ని పొగడ్డం అంటే అదేమీ చిన్న విషయం కాదు. ఇందుకు చాలా ఓపెన్ మైండ్ ఉండాలి. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లలో అక్కినేని నాగార్జున ఒకరు. ఇప్పుడీయన నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

'పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - మహేష్ బాబులు స్టార్ హీరోలే అయినా.. వారు ఆ స్థాయిని అందుకునే సరికి వాళ్ల వయసు 30 ఏళ్లు దాటిపోయింది. కానీ 30లోపే స్టార్ డమ్ అందుకున్న ఒకే ఒక్కడు ఎన్టీఆర్. మంచి సబ్జెక్టులు ఎంచుకుని ప్రేక్షకులను అలరించడంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగాడు. నేను నా కొడుకులకు అదే సలహా ఇస్తుంటాను' అని చెప్పారు నాగార్జున. ప్రస్తుతం ఊపిరి ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు నాగ్. ఈ మూవీని కార్తీ తో కలిసి మల్టీస్టారర్ గా చేశారాయన. అయితే.. అసలు ఊపిరిలో ఎన్టీఆర్ నటిస్తాడని మొదట అనుకున్నారు. దీనిపై కూడా పెదవి విప్పిన నాగ్.. అసలు సంగతి చెప్పేశారు.

'అప్పట్లో ఎన్టీఆర్ ఈ సినిమాకి డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోయాడు. అందుకే ఊపిరిలో కలిసి నటించలేకపోయాం. జూనియర్ తో కలిసి నటించేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే. మంచి సబ్జెక్ట్ తో ఏ డైరెక్టర్ వచ్చినా.. సినిమా చేస్తాను' అంటూ నాగ్ ఓపెన్ గానే చెప్పేశారు. నాగ్ పారాప్లెజిక్(రెండు కాళ్లు రెండు చేతులు చచ్చుబడిపోవడం)గా నటించిన ఊపిరి ఈ నెల 25న విడుదల కానుంది.

,  ,  ,  ,  ,