టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 57వ ఏట అడుగుపెట్టారు. సోమవారం నాగ్ పుట్టినరోజు. తన ఇద్దరు కొడుకులు సినీ పరిశ్రమలోకి వచ్చి హీరోలు అయిన తర్వాత కూడా తాను స్టార్ హీరోగా ఉన్నందుకు చాలా అదృష్టవంతుణ్ని అని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సవాళ్లను అధిగమిస్తూ, ఇంకా హీరోగా అవకాశాలు పొందుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
తన కెరీర్ ద్వితీయార్ధంలో తాను నటించిన సినిమాలు సంతోషాన్ని కలిగించాయని నాగార్జున అన్నారు. తన కొడుకులు నాగచైతన్య, అఖిల్‌కు సలహాలు ఇస్తుంటానని, అయితే తన అభిప్రాయాన్ని వారిపై రుద్దనని చెప్పారు. తాను సలహాలు మాత్రేమ ఇస్తానని, వారికి ఇష్టమైనది చేసే స్వేచ్ఛ ఉందని అన్నారు. నాగచైతన్య కెరీర్లో స్థిరపడ్డాడని, అఖిల్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. అఖిల్ రెండో సినిమా విషయంలో గైడ్ చేస్తున్నాని చెప్పారు. తన చివరి సినిమా సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్ అయిందని, తాను ప్రస్తుతం నటిస్తున్న హతీరామ్ బాబా సినిమా తన మనసుకు దగ్గరగా ఉందని నాగార్జున అన్నారు.