Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 10:17:24
facebook Twitter Googleplus
Photo

హలో చిత్రం ప్రమోషన్ లో నాగార్జున అఖిల్ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు సందడి చేశారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నాగార్జునతో కలిసి అఖిల్ ప్రెస్ మీట్ ఉందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఈ ప్రెస్ మీట్ కి నాగార్జున మాత్రమే హాజరయ్యారు. దీంతో అఖిల్ ప్రెస్ మీట్ మిస్ అవడానికి గల కారణాలను నాగ్ మీడియాకు తెలియజేశారు. ప్రయాణ బడలిక - కంటికి చిన్న ప్రాబ్లమ్ రావడంతోనే అఖిల్ హాజరుకాలేకపోయాడని నాగ్ క్లారిటీ ఇచ్చారు.

హలో ప్రమోషన్ లో భాగంగా అఖిల్ అమెరికా టూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. వరుసగా 5 రోజుల నుండి విమాన ప్రయాణాలు చేయడంతో అలసిపోయాడని - ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డైరెక్ట్ గా ఎయిర్ పోర్ట్ నుంచి ప్రాక్టీస్ సెషన్ కు వెళ్లాడని చెప్పారు. ఆ తర్వాత రాత్రి షోలో డ్యాన్స్ లతో అలసిపోయి లేట్ గా పడుకున్నాడని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి నిద్రలేపితే మొఖం అంతా వాచిపోయి ఉందన్నారు. దానికితోడు కంటికి కూడా ఏదో చిన్న ప్రాబ్లమ్ కనిపించిందని అందుకే తానే ప్రెస్ మీట్ కు వద్దని చెప్పానని క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదల తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలకు అఖిల్ తప్పక వస్తాడని నాగ్ తెలిపారు.

,  ,  ,  ,  ,  ,  ,