Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Sep-2016 11:21:57
facebook Twitter Googleplus
Photo

ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ కి రెడీ చేసేసిన అక్కినేని నాగచైతన్య.. తర్వాత ప్రాజెక్టుని పట్టాలెక్కించే పనిలో పడిపోయాడు. ఎప్పుడో విడుదల కావాల్సిన సాహసం శ్వాసగా సాగిపో.. మల్లూవుడ్ రీమేక్ ప్రేమమ్ లు ఇప్పుడు విడుదలకు రెడీ అయిపోయాయి. మొదట ప్రేమమ్ విడుదల చేసి.. ఆ తర్వాత సాహసం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు చైతు. మరోవైపు తన తర్వాతి సినిమాలో ట్యాలెంటెడ్ ఆర్టిస్టులతో పని చేసేందుకు సిద్ధమవుతున్నా చై.

నాగ్ తో సోగ్గాడే చిన్ని నాయన వంటి బ్లాక్ బస్టర్ తీసిన కళ్యాణ్ కృష్ణ.. నాగ చైతన్యతో మరో సూపర్బ్ లవ్ స్టోరీని లాంఛ్ చేయనున్నాడు. ఈ మూవీలో జగపతి బాబు.. రావు రమేష్ లాంటి హేమాహేమీలతో పాటు టాలెంటెడ్ యాక్టర్ సంపత్ కూడా నటించనున్నారు. చైతు సినిమాలో ఇంతమంది ట్యాలెంటెడ్ కేరక్టర్ ఆర్టిస్టులంటే.. ఇక మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ప్రొ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ.. ప్రేమమ్ రిలీజ్ తర్వాత స్టార్ట్ కానుందని తెలుస్తోంది.

కుర్ర బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీలో లీడ్ హీరోయిన్ గా నటించనుండగా.. మరో యంగ్ భామ లావణ్య త్రిపాఠిని కూడా రీసెంట్ గా అప్రోచ్ అయ్యారు. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనుండడంతో.. ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి.

,  ,  ,  ,  ,