Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2017 12:47:59
facebook Twitter Googleplus
Photo

రారాండోయ్ వేడుక చూద్దాం సినిమా ఈరోజు విడుదలైంది. నిన్న జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో నాగార్జున నాగ చైతన్య డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కలిసి చాలా సరదాగా మాటలు కలిపారులే. ముఖ్యంగా నాగార్జున చాలా తెలివిగా సమాధానం చెబుతూ పక్కదోవ పట్టకుండా చూసుకున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి రకుల్ చేసిన బ్రమరాంబ పేరు మారు మొగుతుంది అదే ప్రశ్న కల్యాణ్ కృష్ణ ను అడిగితే ఇలా చెప్పారు.

పోస్టర్ పైన రకుల్ కొత్తగా కనిపించింది కనుక అందరూ రకుల్ గురించి మాటలాడుతున్నారు. మీరు సినిమాకు వచ్చి చూస్తే శివ పాత్ర చాలా గొప్పగా కనిపిస్తుంది. ఈ సినిమాతో ప్రతి ఇంట్లో ఒక కొడుకులా మారతాడు చైతన్య అంటున్నాడు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమా రీ షూట్ గురించి అడిగితే నాగార్జున ఇలా క్లియర్ గా చెప్పారు రీ షూట్ అనేది బెటర్మెంట్ కోసం చేస్తాము కానీ డైరెక్టర్ ఏదో తప్పు చేశాడు అని కాదు. నేను రీ షూట్ కోసం ఒక 10 రోజులు ఎక్కువ కాల్ షీట్స్ ఇస్తాను. కేవలం బెటర్ గా చేయడం కోసమే అని చెప్పారు. కాని ఈ సినిమా విషయంలో రీషూట్లు జరగలేదు అని చెప్పడం కొసమెరుపు.

ఈ సినిమాలో నాగ చైతన్య పేరు శివ. ఒక పవర్ ఉన్న పేరు ఆ పాత్రకు పెట్టడానికి కారణం ఏంటి అని అడగ్గా.. నేను శివ.. వాడు కేవలం సివ అంతే అని సెలవిచ్చాడు. నిజానికి తను హీరోగా చేసిన సినిమాను కూడా నాగ్ ఇంతగా ప్రమోట్ చేయలేదు. ఈ సినిమాను మాత్రం భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు

,  ,  ,  ,  ,  ,