Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Oct-2016 15:07:29
facebook Twitter Googleplus
Photo

యాక్టర్ నందు టాలీవుడ్ లో చాలాకాలంగానే ఉన్నాడు కానీ.. ఓ ఐదేళ్ల క్రితం 100పర్సెంట్ లవ్ చిత్రంలో చేసిన తర్వాతే అందరూ గుర్తుంచుకోవడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత మళ్లీ అంత పేరు తెచ్చిన సినిమా మరొకటి పడలేదు కానీ.. రీసెంట్ గా పెళ్లి చూపులు చేసిన చిన్న పాత్రకు కూడా మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత ఈ కుర్రాడి టైమ్ అప్ గ్రేడ్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

'కన్నుల్లో నీ రూపమే' అనే మూవీ ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు వరుసగా ఆఫర్లు నందుకు క్యూ కట్టేయడంతో చెప్పుకోదగిన సంఖ్యలోనే సినిమాలను నందు ఒప్పేసుకున్నాడు. వీటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సునీల్ జక్కన్నతో మంచి వసూళ్లు సాధించిన వంశీకృష్ణ ఆకెళ్ల నెక్ట్స్ మూవీ.. రీసెంట్ గా హైద్రాబాద్ లో అఫీషియల్ గా స్టార్ట్ అయింది. అరకు ప్రాంతంలో జరిగే ఓ రొమాంటిక్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించనుండగా.. ఈ మూవీలో రిచా పనాయ్ హీరోయిన్ గా నటిస్తోంది.

హాట్ బ్యూటీ రష్మీతో కలిసి 'శివరంజని' అనే మూవీకి కూడా సైన్ చేశాడు నందు. హారర్ జోనర్ లో రానున్న ఈ మూవీ వచ్చే నెల 4నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఇక వివి వినాయక్ కి అసోసియేట్ గా పని చేసిన వరప్రసాద్ దర్శకత్వంలో రూపొందే ఓ థ్రిల్లర్ కి కూడా నందు సైన్ చేశాడు. శ్రీముఖితో కలిసి నటించిన 'కుటుంబ కథా చిత్రం'కూడా కంప్లీట్ అయిపోయిందట. ఇలా చేతిలో రెండు రెడీగా ఉన్న సినిమాలు.. నాలుగు కొత్త ప్రాజెక్టులతో ఫుల్లు బిజీగా ఉన్నాడు నందు.

,