Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2016 11:28:21
facebook Twitter Googleplus
Photo

మజ్ను అనే పేరు వినగానే.. యాంటీ క్లైమాక్స్ గుర్తొచ్చేస్తుందంటే ఏ మాత్రం తప్పులేదు. గతంలో వచ్చిన సినిమాలైనా.. లైలా మజ్నూల స్టోరీ అయినా.. మన మనసుల్లో అంతగా నాటుకుపోవడమే అందుకు కారణం. అయితే.. నాని మజ్ను అలా కాదట. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకూ కొత్తగా ఉండబోతున్నాడట లేటెస్ట్ మజ్ను.

నాని మజ్నుకి క్లైమాక్స్ నే పెద్ద ఎస్సెట్ అంటున్నారు మేకర్స్. అసలు చివరి అరగంట మూవీ సినిమాకి కీలకం కాగా.. ఈ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్టులు ఊహకు అందని విదంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ఈ మజ్ను క్లైమాక్స్ కొత్తగా ఉంటుందని.. అది యాంటీ మాత్రం కాదని చెప్పడం విశేషం. మజ్ను ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాని కూడా.. సినిమా ఔట్ పుట్ అదిరిపోయిందనే అంటున్నాడు. సెప్టెంబర్ 23న థియేటర్లలోకి రానున్న మజ్ను.. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని కూడా నాని చెబుతున్నాడు.

సినిమాలు వరుసగా చేయడమే కాదు.. అన్నిటి తోను సక్సెస్ సాధిస్తూ.. తన రేంజ్ ని అంతకంతకూ పెంచేసుకుంటుటున్నాడు నాని. ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి మజ్ను పై అంచనాలు చాలా పెరిగిపోయాయి. ఈ సినిమాతో కూడా నాని హిట్ కొట్టాడంటే.. ఇక ఈ నేచురల్ స్టార్ జడ్జిమెంటల్ స్కిల్స్ కి జోహార్ అనాల్సిందే.

,  ,  ,  ,  ,  ,  ,