Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Mar-2017 10:54:41
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు నాని ఫుల్ ఫాంలో ఉన్నాడనే సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం దగ్గర నుంచి.. పరాజయం అనే మాట చూడకుండా సినిమాలు చేసేస్తున్న నేచురల్ స్టార్.. తాజాగా తన చిత్రం నేను లోకల్ తో 34కోట్లకు పైగా షేర్ వసూలు చేసి చరిత్ర సృష్టించేశాడు. తన మరుసటి చిత్రం విడుదలపై కూడా ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశాడట నాని.

3-4 నెలలకు ఓ సినిమా చొప్పున చేసేస్తూ తెగ స్పీడ్ చూపిస్తున్న ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం 'నిన్ను కోరి' అనే చిత్రం చేస్తున్నాడు. శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు ఈ మూవీ రూపొందిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ కోసం.. తొలి షెడ్యూల్ ను యూఎస్ లోనే చేయగా.. ఈ నెలలోనే అక్కడ షూటింగ్ పూర్తయింది. హైద్రాబాద్ వచ్చాక కూడా ఏ మాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ చేసేస్తుండగా.. సమ్మర్ మధ్యలోనే షూటింగ్ పార్ట్ అంతా పూర్తయిపోతుందని తెలుస్తోంది.

అయితే.. జూన్ నెలాఖరు వరకు ఇప్పటికే భారీ సినిమాలు క్యూ కట్టేయడంతో.. జూలైలో తన నిన్ను కోరి మూవీని విడుదల చేయాలని చూస్తున్నాడట నాని. జూలై 7న కానీ.. 14న కానీ.. నిన్నుకోరి చిత్రం రిలీజ్ చేసేలా డేట్ లాక్ చేసుకుని అనౌన్స్ చేసేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,