Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2017 11:37:31
facebook Twitter Googleplus
Photo

పరిశ్రమలోని యంగ్ హీరోల్లో నాని సక్సెస్ రేట్ ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు. తాజాగా చేసిన నేను లోకల్ చిత్రంతో ఆయన డబుల్ హ్యాట్రిక్ కొట్టి బాక్సాఫీస్ ముందు తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఈ చిత్రం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనేగాక నానికి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఓవర్సీస్ లో సైతం సత్తా చూపుతోంది. ప్రీమియర్ల ద్వారా మంచి ఓపెనింగ్స్ రాబట్టి మొదటి ఐదు రోజుల్లో $828,038 గ్రాస్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం రెండవ వారంలో కాస్త నెమ్మదించినా నిన్నటితో అందుకోవాల్సిన మిలియన్ మార్కును అందుకుంది.
దీంతో ఈ చిత్రం మిలియన్ డాలర్ సాధించిన నానై మూడవ చిత్రంగా నిలిచింది. మొదట ఈగ ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ చిత్రాలు ఈ ఫీట్ సాధించాయి. ఈ మధ్య చిన్న, పెద్ద హీరోలంతా ఓవర్సీస్ మార్కెట్ పై బాగా ఆసక్తి చూపుతున్ననైపథ్యంలో నాని ఇలా మూడుసార్లు మిలియన్ డాలర్ మార్క్ అందుకోవడం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం యూఎస్ షెడ్యూల్ త్వరలోనే పూర్తి కానుంది.

,  ,  ,  ,  ,  ,