Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2017 10:08:10
facebook Twitter Googleplus
Photo

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే? ఈ రోజుల్లో ఎవ్వరైనా నాని అనేస్తారు. ఈ ఏడాది నేను లోకల్ తో బాక్స్ ఆఫీస్ బండిని స్టార్ట్ చేసిన నాని నిన్నుకోరి వరకు జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఇప్పుడు అంతే జాగ్రత్తగా మరో బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకోవడానికి ఎమ్ సీ ఏ సినిమాతో వచ్చేస్తున్నాడు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా వుంది. హీరోయిన్ గా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా చిత్ర హీరో నాని సినిమా టీజర్ ని నవంబర్ 10న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. దీంతో నాని ఫాలోవర్స్ ఖుషీగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కోసం చాలా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.

సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఆల్ రెడీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో నాని ఒకప్పుడు చూసిన మిడిల్ క్లాస్ జీవితాన్ని సినిమాలో చూస్తారని ఇది వరకే చెప్పాడు. అంతే కాకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎదురైన అనుభవాలు ఈ సినిమాలు ఉంటాయని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. నాని మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో హైలెట్ గా నిలిస్తోందట. వచ్చే నెల క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ కానుంది.

,  ,  ,  ,  ,  ,  ,