Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2016 11:22:39
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని.. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు ఇచ్చి అన్నింటినీ సక్సెస్ చేసేశాడు. క్రిస్మస్ నాటికి దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న 'నేను లోకల్' ను విడుదల చేయనుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్.. నవంబర్ నెలాఖరు నాటికి పూర్తయిపోతుందని తెలుస్తోంది. అయితే.. నాని ఆ తర్వాత కూడా పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే.. శివ శంకర్ అనే కొత్త దర్శకుడితో సినిమా మొదలుపెట్టనున్నాడు.

కోన వెంకట్.. డీవీవీ దానయ్యలు సంయుక్తంగా నాని కొత్తి సినిమాను ప్రొడ్యూస్ చేయనుండగా.. రీసెంట్ గా వచ్చిన ఓ అప్ డేట్ ఆశ్చర్యం కలిగిస్తోంది. శివ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని.. దాదాపుగా యూఎస్ లోనే షూటింగ్ చేసేయనున్నారట. ఇప్పటికే లొకేషన్స్ సెలక్షన్స్ కోసం కూడా యూనిట్ రంగంలోకి దిగిపోయారని టాక్. నిజానికి నాని సినిమాల్లో ఫారిన్ లొకేషన్స్ లాంటివేమీ కనిపించవు. వీలైనంత తక్కువ బడ్జెట్లో చిత్రీకరణ పూర్తయ్యేలా.. అందుబాటులో ఉన్న చోట్లే సినిమా తీస్తుంటారు.

కానీ ఈ కొత్త చిత్రం విషయంలో మాత్రం ఫారిన్ లొకేషన్స్ లోనే తీయాల్సి ఉండగా.. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తయిపోతున్నాయి. ఈ మూవీలో నానికి జోడీగా జెంటిల్మన్ బ్యూటీ నివేదా థామస్ హీరియన్ గా నటించనుంది. ఫారిన్ లొకేషన్స్ లో పాటలు తీసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపని నాని.. మొత్తం మూవీనే అమెరికాలో తీసేందుకు రెడీ అయ్యాడంటే.. నాని రేంజ్ మార్చేశాడు చూశారా అనే కామెంట్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,