Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 12:29:09
facebook Twitter Googleplus
Photo

ఘంటా నవీన్ బాబు అలియాస్ నాని.. ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. భలే భలే మగాడివోయ్ సక్సెస్ తర్వాత నేచురల్ స్టార్ గా కూడా ప్రమోట్ అయిపోయాడు. దీంతో మనోడు బాగా లెవెల్ పెంచేశాడనే టాక్ బాగానే వినిపిస్తోంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందటే.. ఈ మధ్య మనోడు కొత్త డైరెక్టర్లంటే దూరం..దూరం అంటున్నాడట.

అసలు నాని కెరీర్ చూసుకుంటే.. ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణతో జెంటిల్మన్ తీస్తున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణకు ఫస్ట్ మూవీ అష్టాచెమ్మా. ఆ సినిమాతోనే నాని హీరోగా పరిచయం అయ్యాడు. అంటే నానిని హీరో చేసింది ఓ కొత్త డైరెక్టరే. ఆ తర్వాత నానిని హీరోగా నిలబెట్టిన సినిమా పిల్ల జమీందార్. ఆ వెంటనే రైడ్ లో అవకాశం ఇచ్చిన రమేష్ వర్మకు కూడా డైరెక్టర్ గా అదే మొదటి సినిమా. స్నేహితాడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సత్యం బెల్లంకొండది కూడా సేమ్ సిట్యుయేషన్. భీమిలీ కబడ్డీ జట్టు చిత్రం ఇచ్చిన సత్య తాతినేని కొత్త దర్శకుడే.

వరుస ఫ్లాపుల్లో ఉన్న నానికి ఎవడే సుబ్రమణ్యంతో హిట్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్. ఇతడికి కూడా ఇదే మొదటి సినిమా. ఇంతమంది కొత్త దర్శకులు నానికి హీరోగా ఛాన్సులు ఇచ్చి నిలబెడితే.. ఇప్పుడు కొత్తోళ్లంటే మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నాడట. ఎవరైనా అప్రోచ్ అయేందుకు ప్రయత్నిస్తే.. ముందు ఓ సినిమా తీసి ప్రూవ్ చేసుకున్నాకే కనిపించమంటున్నాడని అంటున్నారు. కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తేనే కదా ఇండస్ట్రీ బాగుపడేది. అసలు అలా ఎంకరేజ్ చేయబట్టే తను హీరో అయ్యాడనే విషయాన్ని నాని మర్చిపోయినట్లున్నాడు కదూ.!

,  ,  ,  ,  ,  ,  ,