Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2017 15:39:09
facebook Twitter Googleplus
Photo

కథ మంచిది అయితే ప్రేక్షకులు వాటిని చిన్న సినిమానా సినిమా పెద్ద సినిమానా అని చూడరు వాళ్ళు దాన్ని చూస్తూ హిట్ చేసేస్తారు అన్న వాస్తవాన్ని హీరో నాని బాగానే అర్ధం చేసుకున్నాడు. అందుకే మళ్ళీ నాని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళిపోతుంటాడు. అది కూడానూ అస్సలు పర్సనల్ బ్రేక్ అనేదే లేకుండా చేస్తున్నాడు. ఒక మీడియా ఇంటర్వ్యూ లో మీకు సెలువు వద్దా అని అడిగితే.. మనోడు ఏమన్నాడో తెలుసా?

మీకో విషయం తెలుసా నేను లోకల్ సినిమా విడుదలైనప్పటికి నిన్ను కోరి షూటింగ్ సగం జరిగిపోయింది. ఇప్పుడు నా కొత్త సినిమా MCA షూటింగ్ జరుగుతుంది. నేను అలా ప్లాన్ చేసుకుంటా. ఒక సినిమా పూర్తికావస్తుంది అనేపాటికి మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ప్లాన్ ఉండి పనిచేసే రోజే సెలవు రోజులా ఉంటే ఇంకా నాకు బ్రేక్ ఎందుకు చెప్పండి? అంటున్నాడు నాని. ఇక నిన్ను కోరి షూటింగ్ అప్పుడు కూడా అస్సలు అలసిపోలేదట. వైజాగ్ - డిల్లీ - శాన్ ఫ్రాన్సిస్కో లలో షూటింగ్ చేశాం ఎక్కడ షూటింగ్ జరిగిన రాత్రి టీమ్ అంతా ఒకదగ్గర చేరి డిన్నర్ చేస్తూ సరదాగా మాటలాడుకుంటూ మరుసటి రోజు స్క్రిప్ట్ పనులు చేసుకుంటూ జాలీగా సాగింది. అందుకే ఎంత పని చేసిన బ్రేక్ తీసుకోవాలి అనిపించదు. పైగా నిన్ను కోరి సినిమాకు పని చేసే వాళ్ళు అంతా యంగ్ అండ్ ఫ్రెష్ టాలెంట్ కాబట్టి ఇంకా విరామం అవసరం లేకుండా పోయింది అని చెప్పాడు.

నాని లేటెస్టు మూవీ నిన్ను కోరి మీ దగ్గరలో ఉన్న థియేటర్ లో చూడవచ్చు. ప్రస్తుతం సినిమాకు మల్టీప్లెక్సుల నుండి మాంచి టాక్ వస్తోంది.

,  ,  ,  ,