Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2016 14:45:57
facebook Twitter Googleplus
Photo

బహుశా టాలీవుడ్లో ఉన్నంత మంది వారసత్వ హీరోలు మరే ఇండస్ట్రీలోనూ ఉండరేమో. గత కొన్నేళ్లలో ఇబ్బడిముబ్బడిగా వారసులు పెరిగిపోయి.. ఇప్పుడు దాదాపుగా ఇండస్ట్రీ అంతా కూడా వాళ్లతోనే నిండిపోయింది. ఒక్క మెగా ఫ్యామిలీలోనే తొమ్మిది మంది హీరోలుండటం అన్నది ఆశ్చర్యకరమైన విషయం. మిగతా ఫ్యామిలీలు కూడా తక్కువేమీ కాదు. అన్ని కుటుంబాలు వారసుల్ని దించుతూనే ఉన్నాయి. ఇంతకుముందు నటన మీద ఆసక్తి లేని వాళ్లకు కూడా ఇప్పుడు ఉన్నట్లుండి దాని మీద ఇంట్రెస్ట్ పుడుతోంది. హీరో అయ్యే ప్రతిభా పాటవాలు ఉన్నా లేకున్నా ముఖానికి రంగేసుకుంటున్నారు. ఫెయిల్యూర్లు ఎదురైనా సినిమాల్ని వదలట్లేదు. ప్రస్తుత స్టార్ హీరోల్లో దాదాపుగా అందరూ వారసులే. చక్రం తిప్పుతున్నది వాళ్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా అరంగేట్రం చేసి.. విజయాలందుకుని.. స్టార్ ఇమేజ్ కూడా సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఘనత నాని సాధించాడు.

కేవలం తన టాలెంటుతోనే నాని స్టార్ హీరోగా మారడం గొప్ప విషయం. ?భలే భలే మగాడివోయ్? సినిమా టైటిల్స్ లో నాని పేరు వెనుక ?నేచురల్ స్టార్? అని వేస్తే అందరికీ సరదాగా అనిపించింది కానీ.. తాజాగా ?జెంటిల్ మన్? సినిమాకు వస్తున్ను రెస్పాన్స్.. కలెక్షన్లు చూస్తుంటే అతను స్టార్ అని ఎవ్వరైనా అంగీకరించక తప్పని పరిస్థితి. నాని జనాలకు ఎంత లవబుల్ హీరోగా మారిపోయాడో.. అతడి ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిందో ఈ సినిమా రుజువు చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు నాని తప్ప మరో ఆకర్షణ ఏమీ లేదు. అంచనాలు కూడా మామూలుగానే ఉన్నాయి. అయినా సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్.. రెస్పాన్స్ వస్తున్నాయి.

టాలీవుడ్ లో స్వశక్తితో స్టార్ గా ఎదిగిన హీరో అంటే ముందు చిరంజీవి పేరే గుర్తుకొస్తుంది. ఆయన అందుకున్న హైట్స్ మరెవ్వరూ అందుకోలేరు. ఆయనతో ఎవ్వరికీ పోలిక లేదు. చిరు తర్వాత అలా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరో అయిన వాళ్లలో రవితేజ బాగా గుర్తుంటాడు. ఐతే రవితేజ టైం వరకు కూడా ఇండస్ట్రీలో వాతావరణం కొంచెం బెటర్ గానే ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఇండస్ట్రీ పూర్తిగా వారసుల మయం అయిపోయింది. ఆధిపత్యం పూర్తిగా కొన్ని కుటుంబాల చేతుల్లోకే వచ్చేసింది. కొత్తగా ఓ హీరో వచ్చి నిలదొక్కుకోవడం.. స్టార్ ఇమేజ్ సంపాదించడం అన్నది అసాధ్యమైన విషయంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నాని ఎదిగిన తీరు.. జనాల్లోకి అతను చొచ్చుకెళ్లిన వైనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తన నటన.. ఎంచుకున్న సినిమాలతోనే అతనీ స్థాయికి చేరాడు. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ లవబుల్ హీరో అయ్యాడు.

,  ,  ,  ,  ,  ,