Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2016 11:06:29
facebook Twitter Googleplus
Photo

పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇబ్బందులు పడుతున్న కొద్దిమంది తిట్టుకుంటుంటే... మెజారిటీ జనం మాత్రం శభాష్ మోడీ అంటూ అభినందిస్తున్నారు. మోడీ అనూహ్య నిర్ణయంపై తెలుగు సినిమా ఇండస్ట్రీ జనాలు కూడా పెద్దయెత్తున స్పందించారు. అందులో దాదాపుగా మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నవాళ్లే. అయితే తారలు ఆన్ లైన్ లో స్పందిస్తున్న తీరును మాత్రం నెటిజన్లు ప్రత్యేకంగా గమనిస్తున్నారు.

కొద్దిమంది సినిమావాళ్లు సినిమాటిక్ గానే స్పందిస్తుంటే మరికొద్దిమంది కూల్ గా మోడీని ఆకాశానికెత్తేస్తున్నారు. మోడీ పాలనలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని ఒకరంటే హైలీ మోడిఫికేషన్ అని మరొకరు కొటేషన్ రాసుకొచ్చారు. యువ కథానాయకుడు నాని కూడా తనదైన శైలిలో స్పందించాడు. ``1947లో గాంధీగారు కొబ్బరికాయ కొట్టారు 2016లో మోడీ గుమ్మడికాయ కొట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇండియా విడుదల`` అని నాని ట్విట్టర్ లో కామెంట్ చేశారు. పక్కా సినిమా స్టైల్ లో చేసిన ఆ వ్యాఖ్య నెటిజన్లని విశేషంగా ఆకట్టుకొంటోంది.

,  ,  ,  ,  ,