Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2016 12:25:54
facebook Twitter Googleplus
Photo

నారా రోహిత్ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న టైంలో ?శంకర? సినిమా మొదలుపెట్టాడు. కానీ నాలుగేళ్ల కిందట ఆరంభమైన ఆ సినిమా ఇప్పటిదాకా విడుదల కాలేదు. ఓ దశలో ఆ సినిమా రిలీజే కాదనుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఈ మధ్యే వార్తల్లోకి వచ్చింది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. కొంత కాలంగా రోహిత్ సైతం ఈ సినిమా గురించి ఏం మాట్లాడకుండా సైలెంటుగా ఉన్నాడు. ఐతే ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడాడు. విడుదలలో ఆలస్యమైనప్పటికీ ?శంకర? కాంటెంపరరీ మూవీ అని.. ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని రోహిత్ చెప్పాడు.

ఈ సినిమా మొదలయ్యాక అనుకున్న ప్రకారమే షూటింగ్ పూర్తయిందని.. ఔట్ పుట్ కూడా బాగా వచ్చిందని రోహిత్ చెప్పాడు. ??షూటింగ్ ఆగడం ఎక్కడా జరగలేదు. సినిమా పూర్తయ్యాక అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఒక మంచి సినిమా తీశామన్న సంతృప్తి ఉంది. సినిమా ఆలస్యమవడానికి కారణాలు ఏవైనప్పటికీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచుతుంది?? అని రోహిత్ అన్నాడు. భీమిలి కబడ్డీ జట్టు.. ఎస్ ఎంఎస్ సినిమాలు తీసిన తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోహిత్ సరసన రెజీనా కసాండ్రా కథానాయికగా నటించింది. తమిళ హిట్ మూవీ ?మౌనగురు?కు ఇది రీమేక్.

,  ,  ,  ,  ,