Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jan-2015 10:44:08
facebook Twitter Googleplus
Photo

ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలు పోషించిన నయనతార ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాలపై దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 'మాయ' అనే సరికొత్త తరహా హారర్ థ్రిల్లర్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ, అదే సమయంలో మరో సవాలుతో కూడిన పాత్ర కూడా చేస్తోంది. వినికిడి లోపంతో బాధపడే అమ్మాయిగా ఈ పాత్రలో నయన్ కనిపించనుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న 'నానుమ్ రౌడీధాన్' అనే తమిళ సినిమాలో ఈ చిన్నది ఇలా కొత్త పాత్ర ద్వారా మనకు దర్శనమివ్వనుంది. అయితే, ఈ వినికిడి లోపం అన్న పాయింటును సీరియస్ గా కాకుండా హాస్యభరితంగా ఇందులో ప్రస్తావిస్తారట. దాంతో ప్రేక్షకులకు ఇక కామెడీయే కామెడీ!

,  ,  ,  ,  ,