Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2016 13:41:06
facebook Twitter Googleplus
Photo

కంచె, లోఫర్ వంటి సినిమాలతో సక్సెస్ జోరుమీదున్న మెగాహీరో ?వరుణ్ తేజ్? తాజాగా దర్శకుడు ?శ్రీను వైట్ల? దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ షూటింగ్ షెడ్యూల్ ఇంకా ఆగష్టు 4 వరకూ స్పెయిన్ లోనే జరగనుంది.
ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది.
హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి వైవిధ్యభరితమైన కథలనే ఎంచుకుంటూ ముందుకెళుతున్న వరుణ్ తేజ్ ఈ చిత్రం తరువాత ?శేఖర్ కమ్ముల? దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.

,  ,  ,  ,  ,  ,