Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2017 13:43:33
facebook Twitter Googleplus
Photo

ఒక మనసు సినిమాతో మెగా అమ్మాయి కొణిదెల నిహారిక దశ తిరిగిపోతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఆ సినిమా ఆమెకు చేదు అనుభవం మిగిల్చింది. ఆ సినిమా ఓ మోస్తరుగా కూడా ఆడలేదు. అట్టర్ ఫ్లాప్ అయింది. ఐతే ఆ సినిమా చేసినందుకు తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని అంటోంది నిహారిక తాను ఎంతో ఇష్టపడే ఆ సినిమా చేశానని ఆమె చెప్పింది. ఐతే ఒక మనసు చేస్తున్నపుడే ఆ సినిమా ఫలితంపై కొంచెం సందేహంగా అనిపించినట్లు నిహారిక వెల్లడించడం విశేషం.

ఒక మనసు సినిమాను నేనెంతగానో ఇష్టపడ్డాను. ఆ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలు షూటింగ్ టైంలో నాకు కలిగాయి. కానీ ఆ కథ నాకు చాలా బాగా నచ్చడంతో సినిమా చేశాను. కాబట్టి నాకు బాధేమీ లేదు. ఆ సినిమా ఆడలేదని డిప్రెషన్లోకి వెళ్లిపోవడం.. ఇంకేదో అయిపోవడం లాంటివేమీ జరగలేదు అని నిహారిక తెలిపింది.

మనసుకు నచ్చిన సినిమాలు చేయడమే ముఖ్యమని.. మిగతా విషయాలన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిహారిక అభిప్రాయపడింది. తాజాగా రవి దుర్గా ప్రసాద్ అనే కొత్త దర్శకుడితో నిహారిక ప్రధాన పాత్రలో ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని సమాచారం. మరోవైపు నిహారిక ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేస్తోంది. అందులో విజయ్ సేతుపతి హీరో కావడం విశేషం. అందులో నిహారికకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోలే దక్కిందట.

,  ,  ,  ,  ,