Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 10:18:55
facebook Twitter Googleplus
Photo

మెగా డాటర్ నీహారిక అరంగేట్రం గ్రాండ్ గానే జరిగింది. సినిమా కంటే ముందు బుల్లితెరపై హోస్ట్ గా అదరగొట్టిన ఈమె.. ఆ తర్వాత వెబ్ సిరీస్ తో కూడా అలరించింది. ఆ తర్వాత ఒక మనసు అంటూ థీమ్ బేస్డ్ మూవీతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ.. జనాలను ఆ సినిమా రంజింప చేయలేకపోయింది. దీంతో ఆమె సెకండ్ ప్రాజెక్ట్ విషయం డైలమాలో పడిపోయింది.

నెలలు గడిచిపోతున్నాయి. నీహారిక ఓకే చెప్పిందంటూ పలు ప్రాజెక్టుల విషయంలో ఆమె పేరు వినిపించింది కానీ.. ఏదీ పట్టాలెక్కలేదు. అయితే.. ఇప్పుడు ఓ తమిళ సినిమాకు నీహారిక ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఓ తమిళ డైరెక్టర్ రీసెంట్ గా నీహారికను.. ఆమె తండ్రి నాగబాబును అప్రోచ్ అయ్యాడట. విజయ్ సేతుపతి హీరోగా నటించే ఈ మూవీలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడట. సాధారణంగా ఈ హీరో సినిమాల్లో.. హీరోయిన్ పాత్ర కూడా చాలా డెప్త్ గా ఉంటుంది. యాక్టింగ్ ఫుల్ స్కోప్ ఉండేలా హీరోయిన్ పాత్రలు ఉంటాయి.

అందుకే వెంటనే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పేసిందట నీహారిక. ఇక మెగడాటర్ కోలీవుడ్ లాంఛింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒకటే పెండింగ్ అంటున్నారు. గతంలో అంజలి.. స్వాతి.. శ్రీవిద్య.. ఆనంది.. బిందుమాధవిలు కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యి.. కోలీవుడ్ లో జెండా పాతేసిన వాళ్లే. ఇప్పుడు నీహారిక కూడా సేమ్ సీన్ రిపీట్ చేసే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.

,  ,  ,  ,  ,