Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Mar-2016 16:35:33
facebook Twitter Googleplus
Photo

హ్యాపీడేస్ మూవీలో నలుగురిలో ఒకడిగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకుని దూసుకుపోతున్నాడు కుర్ర హీరో నిఖిల్. శంకరాభరణం అంటూ ఫ్లాప్ కొట్టినా.. దానికి ముందు హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హిస్టరీ ఉండడంతో.. నిఖిల్ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం నిఖిల్ మొత్తం మూడు ప్రాజెక్టులకు సైన్ చేసేశాడు. వీటిలో ఒకటి ఇప్పటికే షూటింగ్ కూడా జరపుకుంటోంది.

టైగర్ తో గుర్తింపు పొందిన వీఐ ఆనంద్ తో నిఖిల్ ఓ మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ మే నెలలో పూర్తి కానుండగా.. జూలైలో రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా నిఖిల్ ఖాతాలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకు నిఖిల్ కి హిట్ ఇచ్చిన డైరెక్టర్లే చేస్తుండడం విశేషం. స్వామి రారా చిత్రాన్ని తీసిన సుధీర్ వర్మ - కార్తికేయ మూవీని అందించిన చందులతో నిఖిల్ సినిమాలు చేయనున్నాడు. ఇవి ఒకదాని వెనుక స్టార్ట్ కానుండగా.. ముందు ఎవరు స్క్రిప్ట్ రెడీ చేస్తే ఆ సినిమా చేస్తానని నిఖిల్ చెప్పాడు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న మూవీకి బిజినెస్ కంప్లీట్ అయిపోయింది. రెండు రాష్ట్రాల రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ కొనుగోలు చేసింది. పది కోట్లు రిటర్న్ గ్యారంటీ ఆ పై వచ్చిన మొత్తాన్ని సగంసగం పంచుకునే ఒప్పందంతో బిజినెస్ క్లోజ్ చేశారు. దీంతో నిర్మాతకు 4 కోట్లు టేబుల్ ప్రాఫిట్ ముట్టినట్లు తెలుస్తోంది. మూవీ యావరేజ్ గా నిలిచినా.. శాటిలైట్ తో కలుపుకుంటే పది కోట్లు గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. అంటే ప్రస్తుతం నిఖిల్ మార్కెట్ ని 10 కోట్లు అని ఇండస్ట్రీ లెక్క.

,  ,  ,  ,