Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 11:04:40
facebook Twitter Googleplus
Photo

నిఖిల్ సినిమాల వైఖరి మారిపోయింది. ఒక్క శంకరాభరణం మినహాయిస్తే.. ఈ కుర్రాడు డిజప్పాయింట్ చేసినదే లేదు. తన ప్రతీ చిత్రానికి ప్రీ లుక్ దగ్గర నుంచి నావెల్టీ చూపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో కేశవ ప్రీ లుక్ ఏ స్థాయిలో ఆకర్షించిందో చూశాం. ఇప్పుడు శరణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నిఖిల్ సిద్ధార్ధ్.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా.. డిసెంబర్ 2న సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ.. ఓ ప్రీలుక్ ను వదిలారు మేకర్స్. వోట్ ఫర్ కృష్ణ.. రివొల్యూషన్.. బీ ఏ రెబెల్ అంటు ఓ గోడపై రాసిన రాతలు.. చె గువేరా స్కెచ్ కనిపిస్తాయి. ఓ క్రికెట్ బ్యాడ్ ఛాయాచిత్రం కూడా చూస్తుంటే.. క్రికెట్ అంటే మక్కువ ఉండి విప్లవ భావజాలం గల ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ గా నిఖిల్ కనిపించబోతున్నాడనే విషయాన్ని పోస్టర్ ద్వారా చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. ఇక టేబుల్ పై ఇంజినీరింగ్ కి సంబంధించిన బుక్స్.. మెటీరియల్ ను షోకేస్ చేసిన తీరు బాగుంది.

ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. కన్నడలో కిర్రాక్ పార్టీ చిత్రం ద్వారా సెన్సేషన్ సృష్టించిన శాండల్ వుడ్ భామ సంయుక్తా హెగ్డే.. టీవీ సుందరి సిమ్రన్ పరీన్జా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,