Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2016 12:23:52
facebook Twitter Googleplus
Photo

విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఇతడు ఏ జోనర్ లో సినిమా చేస్తాడో.. అది రిలీజ్ అయ్యే వరకూ తెలియడం లేదంటే.. జనాలకు నిఖిల్ ఇచ్చే థ్రిల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది. ఈ తరహా ప్రయోగాలకు ఆడియన్స్ నుంచి కూడా మద్దతు లభించడంతో.. తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ దూసుకుపోతున్నాడీ యంగ్ హీరో. ఇప్పుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయంగా తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇది సైఫై మూవీనా అనే డౌట్ అందరికీ వచ్చింది. అయితే నిఖిల్ మాత్రం.. ఇది ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మాత్రమేనని - విజువల్ గ్రాఫిక్స్ గ్రాండియర్ ఆడియన్స్ షాక్ అవుతరాని అంటున్నాడు. అలాగే కథలో వచ్చే ఊహించని మలుపులు.. ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూనే ఉంటాయని.. సినిమా చూస్తున్నంత సేపు థ్రిల్ అవుతూనే ఉంటారని అంటున్నాడు నిఖిల్.

'ఈ సినిమా ప్రారంభంలో నేను ఇంజినీరింగ్ స్టూడెంట్ గా కనిపిస్తా. ఇందుకోసం సింపుల్ గా హ్యాపీడేస్ లో లుక్ ని ఎంచుకున్నా. ఆ తర్వాత వీఎఫ్ ఎక్స్ డిజైనర్ గా వేరే గెటప్ లో ఉంటాను.' అని చెబుతున్నాడు నిఖిల్. ఈ కుర్రాడికి జంటగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండడం విశేషం. హేభా పటేల్ - అవికా గోర్ - నందితాశ్వేతలు హీరోయిన్స్ కాగా.. వీళ్లు ముగ్గురూ హీరోని తెగ ప్రేమించేస్తారట.

,  ,  ,  ,  ,