Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2017 11:57:41
facebook Twitter Googleplus
Photo

నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో రాజమౌళి చేతులుమీదగా సాంగ్స్ రిలీజ్ చేశారు. బాహుబలి సినిమా ప్రపంచ ప్రచార పనులు అన్నీ పూర్తి చేసుకొని కాస్త రిలాక్స్ అవుతున్నాడు రాజమౌళి. తన తరవాత సినిమాలు కోసం కథలు తయారుచేస్తున్న బిజీలో ఉంటూ నిన్ను కోరి ఆడియో ఫంక్షన్ కు వచ్చి నాని గురించి భలే చెప్పాడులే.

నేను ట్రైలర్ ను చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. వరుసుగా నా ప్రమేయం ఏమి లేకుండా మూడుసార్లు రిపీట్ చేసి చూశాను. ఆ తరవాత ఆలోచించాను ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చూశాను దీన్నని. నాని నటనలో నాకు ఒక విశ్వాశం కనిపించింది. నటుడుగా బాగా కాన్ఫిడెన్స్ సంపాదించాడు. నేను ఏడిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఏడుస్తారు నేను నవ్విస్తే వాళ్ళు తప్పకుండా నవ్వుతారు అని నాని కి గట్టి నమ్మకం ఏర్పడింది. అందుకే నేను అన్నిసార్లు చూశాను. ఇంకా ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి. దానయ్య బాగా ఖర్చు పెట్టి తీశారు గోపి సుందర్ మ్యూజిక్ అయితే తాళానికి పాదం ఆడేటట్టు ఉంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది దానయ్యకు ఆల్రెడీ డబ్బులు మిగిలినట్లే అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నానికి ధీటుగా నివేథ చాలా బాగ యాక్ట్ చేసింది. ఆది పినిశెట్టి చాలా అందంగా ఉన్నాడు అని చెప్పాడు” అన్నాడు రాజమౌళి. ఈ సందర్భంగా తొలిరోజు తొలి ఆట టిక్కెట్ ను రాజమౌళి రిలీజ్ చేశాడు.

కొత్త డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించాడు. నాని నివేథ థామస్ ఆది నటిస్తున్న ఈ సినిమా జూలై 7 నాడు విడుదల అవుతుంది. నాని సినిమా అంటే నష్టం రాని సినిమా అని ప్రొడ్యూసర్లులలో ఒక నమ్మకం ఉంది ఈ విషయంలో ప్రొడ్యూసర్లు కొంచం శాంతంగానే ఉండవచ్చు.

,  ,  ,  ,  ,  ,