Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 12:09:55
facebook Twitter Googleplus
Photo

మామూలుగా పంచ్ లు వేయడం అంటే.. రైటర్ రాసింది చెబుతున్నారులే అనుకోవచ్చు. కాని ప్రేమతో కూడిన పంచులు వేయాలంటే మాత్రం.. అది ఖచ్చితంగా హీరో నాని తరువాతే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనోడు వేసే పంచులు.. ప్రతీ సినిమా టీజర్ తోనే బయటపడుతుంటాయి. ప్రేమ రసం కాదురా.. చట్నీ అంటూ మజ్ఞూ సినిమా టైములో వేసిన పంచ్ ఇంకా జనాలను టీజ్ చేస్తున్న వేళ.. ఇప్పుడు మరో పంచ్ వేశాడు.

నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరక్షన్లో రూపొందుతున్న నిన్ను కోరి సినిమా టీజర్ ఈరోజే విడుదలైంది. ఈ టీజర్లో.. తాను చేస్తోంది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరి టైపు సినిమా అని చెప్పకనే చెప్పేశాడు నాని. ఈ అమ్మాయిలు అస్సలు అర్ధంకారు. అన్ని అలవాట్లూ ఉన్నోడిని ప్రేమిస్తారు. ఏ అలవాటు లేని వాడిని పెళ్ళి చేసుకుంటారు అంటూ సెలవిచ్చాడు. మరోసారి పంచ్ వేసేశాడు. ఈ ప్రేమ్ పంచ్ కొంతమందికి చాలా గాట్టిగా కనక్ట్ అయిపోయింది. ముఖ్యంగా గోపిసుందర్ ఇచ్చిన స్ర్టింగ్స్ మ్యూజిక్ నేపథ్యంలో భలేగా ఉంది. అయితే గతంలో మణిరత్నం తీసిన కొన్ని సినిమాలకు దగ్గరగా ఆ పాయింట్ ఉందంటూ సీనియర్ సినిమా లవర్స్ కామెంట్స్ చేస్తున్నారులే.

,  ,  ,  ,  ,