Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2016 12:41:00
facebook Twitter Googleplus
Photo

సినిమాల విషయంలో యంగ్ హీరోలు తెగ ట్యాలెంట్ చూపించేస్తున్నారు. లవర్ బోయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన అ..ఆ.. మూవీ.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాక్షిగా ఆడియో రిలీజ్ జరుపుకుంది. ఈ ఫంక్షన్ లో అ..ఆ.. గురించి రెండు రకాల వెర్షన్స్ అబ్రివేషన్స్ చెప్పి ఆశ్చర్యపరిచాడు నితిన్. త్రివిక్రమ్ గారి స్టైల్ లో చెప్పాలంటే అ..ఆ.. అంటే అందమైన ఆహ్లాదకరమైన చిత్రం. అదే పవన్ స్టైల్ లో చెప్పాలంటే.. "అ..ఆ.." అంతే. అని చెప్పాడు నితిన్.

'ఈ సినిమాలో నటించిన వారిలో 90 శాతం నాతో మొదటిసారి నటించారు. హీరోయిన్ సమంత నుంచి డైరెక్టర్ త్రివిక్రమ్ తో సహా ఇదే నాకు మొదటి మూవీ. ఈ సినిమాలో చేయడం ద్వారా త్రివిక్రమ్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన నడిచే డిక్షనరీ నడిచే ఎన్ సైక్లో పీడియా వాకింగ్ గూగుల్ త్రివిక్రమ్' అన్నాడు నితిన్. నిజానికి ఈ సినిమాలో మనోడు ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. బాహుశా తనకు ఇష్టమైన ఒక టీమ్ తో పనిచేయడం వలనే నితిన్ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడేమో.

,  ,  ,  ,  ,  ,  ,