Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2015 16:58:33
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సినిమాకి మూడేళ్ళు తీసుకుంటే పర్లేదు కానీ అత్తారింటికి దారేది సినిమాకి అన్నేళ్ళు అంటే కష్టం. రెండూ వేటికవే ప్రత్యేకం. త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకులు సినిమా సినిమాకీ మరీ అంత గ్యాప్ తీసుకూడదు అనేది సగటు సినీ అభిమాని అభిప్రాయం. పరిశ్రమ కోరేది ఇదే.

ఖలేజా సినిమా వరకూ త్రివిక్రమ్ సినిమా అంటే మూడేళ్ళు ఎదురుచూడాల్సిందే. జులాయి సినిమా రావడానికి రెండేళ్ళయినా షూటింగ్ మాత్రం త్వరగా ఫినిష్ చేసేశారు. ఇప్పుడీ చర్చ ఎందుకు వచ్చిందటే సన్నాఫ్ సత్యమూర్తి తెరమీదికొచ్చి నాలుగు నెలలు కావస్తోంది. సినిమా ప్రకటన అయినా లేదు. అయితే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తెరకెక్కే తరుణం రానే వచ్చిందిప్పుడు.

నాగ చైతన్యతో నితిన్ తలపడి చివరికి ఈ అవకాశాన్ని పట్టేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ సినిమా అంటే అది ఖచ్చితంగా నితిన్ కెరీర్ కి ప్లస్సే. త్రివిక్రమ్ ఆప్తమిత్రుడు ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నారు. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

,  ,