Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2016 16:27:55
facebook Twitter Googleplus
Photo

లవర్ బోయ్ నితిన్ జోరు మామూలుగా లేదు. పెద్ద డైరెక్టర్లు హిట్ దర్శకులతో వరుసగా ఛాన్సులు పట్టేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమాని చక్కబెట్టేస్తున్న ఈ కుర్రాడు.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టేశాడు. ఇప్పుడు చేస్తున్న మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకముందే.. కొత్త ప్రాజెక్ట్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసేయడం విశేషం.

ఈ ఏడాది జనవరి 1న రిలీజ్ అయిన రామ్ - కీర్తి సురేష్ ల నేను శైలజ మూవీతో.. గుర్తింపుపొందాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ప్రతీ సన్నివేశాన్ని జాగ్రత్తగా తెరకెక్కించాడని ఎనర్జిటిక్ హీరోని పర్ ఫెక్ట్ గా యూజ్ చేశాడని కితాబు అందుకున్నాడు. ఇప్పుడీ కిషోర్.. హీరో నితిన్ కి ఒక స్టోరీ వినిపించాడు. ఈ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చడంతో నితిన్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్ లో అఫీషియల్ గానే అనౌన్స్ చేశాడు.

'అందరికీ హాయ్.. మీ అందరితో నా కొత్త ప్రాజెక్ట్ ని గురించి న్యూస్ పంచుకోవడం హ్యాపీగా ఉంది. నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నా. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తా' అంట ప్రకటించాడు నితిన్. ఇష్క్ మూవీ నుంచి వరుసగా హిట్స్ కొడుతున్న నితిన్.. ఆ తర్వాత ఫెయిల్యూర్స్ అన్న మాటకు దూరంగా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అలాగే డైరెక్టర్ స్టోరీ ఎంపిక విషయంలోనూ ఎంతో అలర్ట్ గా ఉంటున్నాడు. కొత్త ప్రాజెక్టు కూడా ఓ బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీనే అని తెలుస్తోంది.

,  ,  ,  ,