Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 10:36:25
facebook Twitter Googleplus
Photo

వరుసగా మూణ్నాలుగు వస్తేనే ఓ హీరోకు చాలా కష్టమైపోతుంది. అలాంటిది ఏకంగా వరుసగా 14 ఫ్లాపులిచ్చాడు నితిన్. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేశాడు. చివరికి ?ఇష్క్? సినిమాతో హిట్టు కొట్టి హీరోగా మళ్లీ నిలదొక్కుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో నితిన్ చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్న విషయం అతను ఎంచుకున్న సినిమాలు.. వాటికి వస్తున్న ఫలితాల్ని బట్టే తెలిసిపోతుంది. స్క్రిప్టు నచ్చలేదని పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టరుకే నో చెప్పాడు నితిన్. అలాగే ?గుండెజారి గల్లంతయ్యిందే? దర్శకుడు విజయ్ కుమార్ కొండా చెప్పిన కథ సంతృప్తినివ్వకపోవడంతో ఆ సినిమా నుంచి కూడా తప్పుకున్నాడు.

ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లిన నితిన్.. త్వరలో భాగ్యరాజ్ కన్నన్ అనే యువ దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ దర్శకుడు శివ కార్తికేయన్ తో ?రెమో? అనే సినిమా తీశాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య దసరాకు విడుదల కాబోతోంది. ?రెమో? సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన పీసీ శ్రీరాంకు భాగ్యరాజ్ ఓ కథ చెప్పగా.. హీరోగా ఆయన నితిన్ పేరు సూచించాడట. ఇంతకుముందు పీసీ శ్రీరాం నితిన్ ?ఇష్క్? సినిమాకు పని చేసిన సంగతి తెలిసిందే. ఐతే నితిన్ ఇప్పటిదాకా పరభాషా దర్శకులతో పని చేసిన ప్రతిసారీ ఎదురు దెబ్బలే తగిలాయి. కరుణాకరన్ (చిన్నదాన నీకోసం).. సిద్ధిఖ్ (మారో).. ప్రేమ్ సాయి (కొరియర్ బాయ్ కళ్యాణ్) అతడికి చేదు అనుభవాల్నే మిగిల్చారు. మరి భాగ్యరాజ్ కన్నన్ అతడికి ఎలాంటి ఫలితాన్నిస్తాడో చూడాలి.

,  ,  ,  ,  ,