Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2014 10:49:29
facebook Twitter Googleplus
Photo

'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో నిత్యామీనన్ నటించనుంది. మలయాళంలో హిట్టయిన 'బెంగళూర్ డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో దిల్ రాజు రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఇందులో నిత్యా ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఈ విషయమై ఇటీవల దర్శకుడు ఈ ముద్దుగుమ్మను కలసి చర్చించినట్టు, ఆమె తన అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు. ఆర్యాకు జంటగా ఆమె నటిస్తుంది. విశేషం ఏమిటంటే, ఈ సినిమా మలయాళం ఒరిజినల్ లో నిత్యా గెస్ట్ పాత్ర చేసింది. ఇదిలా ఉంచితే, సిద్ధార్థ్, సమంతా మరో జంటగా నటిస్తారనీ, మూడో జంట ఎంపిక జరుగుతోందనీ అంటున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ కి వెళుతుంది.

,  ,  ,  ,  ,