Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jun-2016 17:02:35
facebook Twitter Googleplus
Photo

కొన్నాళ్ల క్రితం వరకూ నిత్యా మీనన్ ఓ సినిమా ఒప్పుకుందంటే.. కచ్చితంగా అందులో మాంచి కంటెంట్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్ లో ఉండేది. ఈ మధ్య వరుసగా ఈ మలయాళీ భామ రోల్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఒకవేళ సినిమా క్లిక్ అయినా.. అమ్మడి రోల్ కి విమర్శలు వస్తున్నాయి. దీంతో నిత్యా మీనన్ లో డెసిషన్ పవర్ తగ్గిపోయిందనే విమర్శలు చుట్టుముట్టాయి.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కి జంటగా నిత్యా మీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ భామ బ్యాడ్ ఫేజ్ నడుస్తుండడంతో దాన్ని కవర్ చేసేందుకు.. జనతా గ్యారేజ్ యూనిట్ ఇప్పుడు తమ వ్యూహం మార్చింది. ఇన్నాళ్లు ఈ సినిమాలో నిత్యా సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరగ్గా.. ఇప్పుడీమె రోల్ సర్ ప్రైజింగ్ ప్యాకేజ్ లా ఉంటుదని చెబుతున్నారు. ఈ చిన్నది ఓ కొత్త అవతారంలో కనిపిస్తుందని.. ఆమె పెర్ఫామన్స్ సినిమాకి కీలకమైన పాయింట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. నిత్యా రోల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేస్తాయని గ్యారేజ్ టీం అంటోంది.

హైద్రాబాద్ లో ఇప్పుడీ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నెలాఖరుకల్లా టాకీ పార్ట్ పూర్తి కానుందట. జూలై మధ్యలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి.. ఆగస్ట్ 12న విడుదల చేయనున్నారు.

,  ,  ,  ,  ,