Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Dec-2017 14:10:42
facebook Twitter Googleplus
Photo

అజ్ఞాతవాసి టీజర్ రానే వచ్చేసింది. పవర్ స్టార్ అభిమానులకు అది అమితానందం కలిగించింది. ఇంకొక్క రోజులో అజ్ఞాతవాసి ఆడియో వేడుక కూడా భారీ స్థాయిలో జరగబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫుల్ ఆడియో ఎలా ఉంటుందో చూడాలని సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఆడియో వేడుకలో పవన్ ఏం మాట్లాడతాడు.. త్రివిక్రమ్ ఏం చెబుతాడు.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఎలా సందడి చేస్తాడు అని అభిమానుల చర్చించుకుంటున్నారు. మామూలుగా ఆడియో వేడుక అనగానే అదే రోజు థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేయడం ఆనవాయితీ. కానీ అజ్ఞాతవాసి టీం ఆ సంప్రదాయాన్ని పాటించబోవట్లేదని సమాచారం. మూడు రోజుల కిందటే టీజర్ లాంచ్ చేసి.. ఇంతలోనే ట్రైలర్ విడుదల చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. 19న ఆడియో ట్రీట్ చాలని.. అదే జనాల్ని బాగా ఎంగేజ్ చేస్తుందని అనుకుంటున్నారట.

ఆడియో వేడుక తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి.. క్రిస్మస్ కానుకగా ట్రైలర్ లాంచ్ చేస్తారట. అలా అయితే ప్రమోషన్ పరంగా కూడా బాగుంటుందని.. మూడు రోజుల పాటు టీజర్ డిస్కషన్లో ఉన్న జనాల దృష్టి తర్వాత ఆడియో మీదికి మళ్లుతుందని.. ఆపై ఐదారు రోజుల గ్యాప్ లో ట్రైలర్ లాంచ్ చేస్తే.. దాని మీద కొన్నాళ్ల పాటు చర్చ నడుస్తుందని భావిస్తున్నారట.

,  ,  ,  ,  ,